నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది
ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని *ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు, జీవీ ఆంజనేయులు రైతులకు భరోసా ఇచ్చారు. గత శనివారం కురిసిన అకాల వర్షంతో ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను
ప్రభుత్వ చీఫ్ విప్ జివీ వ్యవసాయ అధికారులతో మరియు మక్కెన మల్లికార్జున రావు కలిసి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట వివరాలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించాలని చీఫ్ విప్ జీ.వి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్య పడవద్దని నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం లో నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది)