ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రతీ సమస్యను సానుకూలంగా స్పందిస్తున్న రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం క్యాంపు కార్యాలయంలోప్రజల సమస్యలు పరిష్కారం అవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నరు. ప్రజలు ప్రజాదర్బార్ లో ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్న మంత్రి సంధ్యారాణి అన్నారు
ఈ కార్యక్రమంలో భాగంగా మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామానికి చెందిన చొంగలి శంకరరావు కుమారుడికి 2017 నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ దాదాపు 7లక్షల వరకు ఖర్చు ఇయిందని, ఇంకా వైద్యం కొనసాగించవలసిన అవసరం ఉన్నందున 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పియున్నారు.అందువలన సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేయాలని కోరారు. మంత్రి గారు స్పందించి ఆర్థిక సహాయం అందేలా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని తెలిపారు.
పాచిపెంట మండలం పెద్దగెడ్డ ప్రాజెక్టు నిర్వాసితులైన కొటికిపెంట పునరావాస గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు తెలిపారు.
పాచిపెంట మండలం గొట్టూరు పంచాయితీ కొత్త పొలంవలస గ్రామస్తులు కొటికిపెంట గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెం 210 లో సాగు భూమి వుందని, గతంలో 2 సార్లు భూసర్వే జరిగిన సమయంలో మేము అందుబాటులో లేనందున సర్వే నిలిచిందని తెలిపారు.
సాలూరు మండలం కారడవలస గ్రామానికి చెందిన యువత వచ్చి సెల్ టవర్, మంచినీరు ఏర్పాటు చేయాలని కోరారు.
సాలూరు మండలం కొదమ పంచాయితీకి రోడ్లు మంజూరు చేయాలని కొంతమంది యువత మంత్రి సంధ్యారాణి గారికి వినతి పత్రం ఇచ్చారు.
వారి సమస్యలు విన్న మంత్రి గారు సానుకూలంగా స్పందించి , అన్ని సమస్యలు పరిష్కారం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. (Story : ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన)