సత్య కళాశాల విద్యార్థి కి కబడ్డిలో ద్వితీయ స్థానం
న్యూస్‌తెలుగు/విజయనగరం: సత్య డిగ్రీ, పీజీ కళాశాల లో బిఎ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిబి. నీలిమఇటీవల ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో జరిగిన 71వ ఆంధ్ర సీనియర్ పురుషులు, మహిళలు కబడ్డీ చాంపియన్షిప్ లో విజయనగరం కబడ్డీ జట్టు లో పాల్గొని ద్వితీయ స్థానం సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి, కళాశాల ఫిజికల్ డైరక్టర్ ఎస్ హెచ్ హెచ్ ప్రసాద్ , నీలిమ ను అభినందించారు. (Story : సత్య కళాశాల విద్యార్థి కి కబడ్డిలో ద్వితీయ స్థానం)