Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నాణ్యమైన విద్యుత్తును అందించింది వైసీపీ ప్రభుత్వమే

నాణ్యమైన విద్యుత్తును అందించింది వైసీపీ ప్రభుత్వమే

0

నాణ్యమైన విద్యుత్తును అందించింది

వైసీపీ ప్రభుత్వమే

సూపర్ సిక్స్ హామీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం
ఈనెల 27న విద్యుత్ కార్యాలయవినతిపత్ర కార్యక్రమం విజయవంతం చేయండి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

న్యూస్‌తెలుగు/ విజయనగరం :  నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించిన ఘనత కేవలం వైసిపి ప్రభుత్వానికే దక్కిందని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈనెల 27న కరెంటు చార్జీల బాదుడిపై వైసీపీ పోరుబాట కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) అన్నారు.మంగళవారం ధర్మపురి వద్ద ఉన్న తన కార్యాలయంలో వీటికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా రెండవసారి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిందన్నారు. అధికారం చేపట్టి ఆరు మాసాల కావస్తున్న సూపర్ సిక్స్ అని చెప్పి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన 9 విద్యుత్తును రైతులకు అందించామన్నారు. ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా ఆదుకునేందుకు 200 యూనిట్లు వాడిన వారికి ఉచిత విద్యుత్తును అందించడం జరిగిందన్నారు. రెండవసారి విద్యుత్ ఛార్జీలు పెంచి 15 వేల కోట్లు ఆర్థిక భారం ప్రజలపై వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. గతంలో తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల ధాన్యాన్ని నేరుగా వారి వద్ద కొనడం జరిగిందన్నారు. ప్రస్తుతం పండిన ధాన్యమంతా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. రైతులను పూర్తిగా గాలికి వదిలేసారన్నారు. ఈ అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న, మినుము, పెసలు రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంకరెంటు చార్జీల బాదుడిపై. ఈనెల 27న జరిగే వైసిపి పోరుబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగే విద్యుత్ కార్యాలయాల వినతి పత్ర కార్యక్రమాలలో ఉమ్మడి జిల్లాలలో ఉండే వైసీపీ నాయకులంతా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్ వి వి రాజేష్, ఆసపు వేణు, పేరు బండి జైహింద్ కుమార్, గదుల సత్య లత, బంగారు నాయుడు, తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. (Story : నాణ్యమైన విద్యుత్తును అందించింది వైసీపీ ప్రభుత్వమే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version