ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగ దారుల
హక్కుల దినోత్సవం
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు లోని ప్రభుత్వ కళాశాలలో వినుయోగదారుల హక్కుల దినోత్సవం మంగళవారం జరిపారు. ఈ కార్యక్రమం లో వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి జి.హరతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి గా అడ్వకేట్ యం.రవితేజ,వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ హాజరయ్యారు. యం.రవితేజ విధ్యార్ధినీ,విధ్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోరకు1986 డిసెంబర్ 24న వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రకటించారు.ఈచట్టాన్ని 2019 సంవత్సరం లో ప్రత్యేకంగా రివ్యూ చేసి వినియోగదారుడికి నష్టం జరిగితే జిల్లా ఫోరం లో ఫిర్యాదు చేయాలనీ నష్టం జరిగిన వినియోగ దారుడుకి జిల్లా కలెక్టర్ ప్రధాన న్యాయాధికారి గా ఉండి నష్టపరిహారం సమకూర్చుతారని తెలిపారు. నష్టపోయిన వినియోగదారులకు ఐ.పి.సి.సెక్షన్ 27 ప్రకారం నష్టపరిహారం 45 రోజులలో అందచేస్తారనీ తెలిపారు.వినియోగదారులహక్కుల పరిరక్షణ కోసం 32చట్టాలు ఉంటాయని తెలిపారు.వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ వలన వినియోగదారుడుకీ న్యాయం జరుగుతుందని తెలిపారు.వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి జి.హరతి.మాట్లాడుతూ వినియోదారుల హక్కుల దినోత్సవంగా1986 నుండి ఇప్పటివరకు వినుయోగదారుల హక్కుల పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ యం.రవితేజను విధ్యార్థినీ,విధ్యార్థులు సన్మానించారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు జి.వెంకటరావు,ఆర్.సిహెచ్.నాగేశ్వరావు,యస్.అప్పనమ్మ,బి.శ్రీనివాసరావు, కె.శైలజ,డాక్టర్.వై.పద్మ, కె.శ్రీదేవి,కె.శకుంతల,కె.శ్రీలక్ష్మి.జి.సాయికుమార్,యన్.రమేష్ తదితర అధ్యాపక, అధ్యాపకేతరసిబ్బంది,విధ్యార్థిని,విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగ దారుల హక్కుల దినోత్సవం)