ఈనెల 27 న జరిగే వైసిపి పోరుబాటను
జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజలను మోసంచేసి విద్యుత్ ఛార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధం కావాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి ఓప్రకటన విడుదల చేశారు. కరెంట్ ఛార్జీల బాదుడు పై వినుకొండలో ఈ నెల 27న వైసీపీ పోరుబాట చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బొల్లా పిలుపునిచ్చారు. (Story : ఈనెల 27 న జరిగే వైసిపి పోరుబాటను జయప్రదం చేయండి)