Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్షేత్ర స్థాయిలో పేకాట, కోడి పందాలపై దాడులను విస్తృతం చేయాలి

క్షేత్ర స్థాయిలో పేకాట, కోడి పందాలపై దాడులను విస్తృతం చేయాలి

0

క్షేత్ర స్థాయిలో పేకాట, కోడి పందాలపై దాడులను విస్తృతం చేయాలి

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., డిసెంబరు 24న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – గంజాయి అక్రమ రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, ఆక్రమ రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని, ప్రధాన వ్యాపారులను గుర్తించి, ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలన్నారు. నేరాలను నియంత్రించుటకు పగలు, రాత్రి బీట్లును వేయాలని, పెట్రోలింగును మరింత విస్తృతం చేయాలన్నారు. నేరాలు, ఈవ్ టీజింగు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్ళ వద్ద బ్యాంకులు,కళాశాలల వద్ద గస్తీని పెంచాలన్నారు. రాత్రి గస్తీకి వెళ్ళే సిబ్బంది తప్పనిసరిగా తమ వెంట లాఠీ, విజిల్, టార్చ్ లైటు, వాహనానికి సైరన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాత్రి సమయాల్లో అనుమానస్పదంగా తిరిగే వ్యక్తుల వేలి ముద్రలను పాపిలాన్ లైవ్ స్కానర్స్ నిక్షిప్తం చేయాలని, వారి నేర చరిత్రను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 11గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే వారి షీట్లును ఆయా ప్రాంతాలకు బదిలీ చేసి, వారిపై నిఘా పెట్టాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన ఆస్తుల వివరాలను క్రమ పద్దతిలో రిజిస్టరులో నమోదు చేయాలన్నారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ధిష్ట సమయంలోగా పూర్తి చేసి, దర్యాప్తు వివరాలను ఆన్లైనులో నిక్షిప్తం చేయాలన్నారు. పోక్సో, రేప్ కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేసి, న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కేసుల దర్యాప్తు వివరాలను, డిస్పోజల్ వివరాలను ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో నమోదు చేయాలన్నారు. 7సం.లకు పైబడి శిక్షలు పడే కేసుల్లో అరెస్టు కాబడే నిందితుల వేలి ముద్రలను పాపిలాన్ స్కానర్స్ నందు నిక్షిప్తం చేయాలన్నారు. క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లో అలసత్వం వద్దని, ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులుగా నమోదు చేయాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో అనధికారంగా మద్యం విక్రయాలు (బెల్టు షాపులు) లేకుండా చూడాలని, క్షేత్ర స్థాయిలో నిఘా పెట్టి, బెల్టు షాపులపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో పేకాట, కోడి పందాలు జరగకుండా చూడాలని, ముందస్తుగా సమాచారం సేకరించి, దాడులు నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శనలు తరుచూ చేయాలని, ప్రజలకు వివిధ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు, రహదారి భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు పట్ల అవగాహన కల్పించాలన్నారు. నేరాలను నియంత్రించుటలో భాగంగా పోలీసు స్టేషను పరిధిలోని నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న క్రైం ప్రోన్ ఏరియాల్లోను, ముఖ్య కూడళ్ళలోను సిసి కెమెరాలను స్థానికుల సహకారంతో ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. డాబాల్లో మద్యం సరఫరా జరగకుండా చూడాలని, ఎవరైనా మద్యం సరఫరా చేస్తే వారిపై ఎన్ఫోర్స్మెంటు కేసులు నమోదు చేయాలన్నారు.వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్.డి.పి.ఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎస్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసి, గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు
వివిధ విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, సిసిటిఎన్ఎస్ కేసుల వివరాలను సకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, ఆర్ఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : క్షేత్ర స్థాయిలో పేకాట, కోడి పందాలపై దాడులను విస్తృతం చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version