UA-35385725-1 UA-35385725-1

ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన

ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన

న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో కళ్ళకు నల్లని గంతలు కట్టుకొని విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్, మాజీ విద్యార్థినేత గోపాలకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయక విద్యార్థులు పడుతున్న ఇబ్బందును పాలకులు చూడటం లేదని, కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టామన్నారు.రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పైనే ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నిధులు విడుదలక చేయకపోవడంతో ఫీజులు కట్టమని, కళాశాలల నుంచి పంపేస్తున్నారని, పాసైన విద్యార్థులకు పై చదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి ఒత్తిడిలో చదువులు సాగించలేకపోతున్నారని విమర్శించారు. పాలకులు ప్రభుత్వ విద్యకు తగినన్ని నిధులను కేటాయించటం లేదన్నారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ‌ మాజీ విద్యార్థినేత గోపాలకృష్ణ, చంద్రశేఖర్, మోహన్, అరవింద్, గణేష్, శివ, బన్నీ, చరణ్, కళ్యాణ్ మురళి, భాను, బాలు, ఓంకార్, యుగంధర్, చిన్న చరణ్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1