ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పేసా దినోత్సవం
న్యూస్‌తెలుగు/చింతూరు : ముకునూరు గ్రామపంచాయతీ లో పేసా చట్టం అమలులోకి వచ్చిన రోజు సందర్బంగా మంగళవారం ఐటీడీఏ పిఓ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో పేసా దినోత్సవాన్ని నిర్వహించారు , ఆదివాసీ ఉద్యమ స్వాతంత్ర సమరయోధులు అయినా బిర్షా ముండా గారు జయంతి (జన జయంతి గౌరవ దివాస్) సందర్బంగా గ్రామపంచాయతీ సర్పంచ్ బీరబోయిన సత్యకుమారి , ఎంపీపీ అమల హాజరై బిర్సా ముండాకు నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ సత్యకుమారి అధ్యక్షతన గ్రామపంచాయతీ వద్ద పేసా సెలెబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. ఈ గ్రామసభ లో పేసా గ్రామ కమిటీ కి కొత్తగా ఎన్నిక అయిన పేసా గ్రామ ఉపాధ్యక్షులు,గ్రామ కార్యదర్శులు, యం. పి. పి.అమల ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో , యం. డి. ఓ.చైతన్య కళ్యాణ్ జై భరత్ దేవ్ , పంచాయతీ సెక్రటరీ మాగంటి సురేష్, రమేష్, ముకునూరు సచివాలయం సిబ్బంది, ఆశ, అంగన్వాడీ, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story : ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పేసా దినోత్సవం)