UA-35385725-1 UA-35385725-1

ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నఉన్నతాధికారులు నిర్ణయాలు..

ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న

ఉన్నతాధికారులు నిర్ణయాలు..

రద్దు చేసిన బస్సులను కొనసాగించాలి..
కార్మికులపై ఆర్.టీ.సి డి.యం వేధింపులు ఆపాలి..
ఉన్నతాధికారుల మొండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ డిపో ముందు సిపిఎం ధర్నా..
డిసెంబర్ నెలాఖరుకు బస్సులు పునరుద్ధరిస్తాం..డిపో మేనేజర్ హామీ..

న్యూస్‌తెలుగు/చింతూరు :  భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను రద్దు చేయడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుందని ఇటువంటి నిర్ణయాలు ఆర్టీసీ ఆర్.ఎం మరియు భద్రాచలం డిఎం లు తీసుకోవడం సరైనది కాదని, రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను వెంటనే పునరుద్ధరించాలని, భద్రాచలం డిపోలో కార్మికులపై ఆర్టీసీ డిఎం వేధింపులు ఆపాలని, సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా వద్దకు ఆర్టీసీ డి.ఎం తిరుపతిరావు వచ్చి డిసెంబర్ నెల చివరినాటికి రద్దు చేసిన బస్సులను పునరుద్ధరిస్తామని, కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులతో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు లు మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి అనేక రాష్ట్రాల నుంచి భద్రాచలం వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రయాణం దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడుతుందని, భద్రాచలం నుండి బి హెచ్ సి ఎల్, కెపిహెచ్బి, చెన్నై, శ్రీశైలం తదితర బస్సులు రద్దు చేయడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేటు ట్రావెల్స్ వైపు వెళ్లి అధిక భారాన్ని మోయవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు. మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర డిపోల నుండి మియాపూర్ వరకు మూడు మస్టర్లతో బస్సులు నడుపుతున్నప్పుడు భద్రాచలం నుంచి నడపడానికి వస్తున్న ఇబ్బంది ఏమిటి అని వారు ప్రశ్నించారు. గత నెల రోజుల క్రితమే సిపిఎం పట్టణ కమిటీ ఆర్టీసీ భద్రాచలం డిఎంకు వినతిపత్రం సమర్పించినా స్పందించకపోవడం దారుణమని అన్నారు. కూనవరం విఆర్ పురం సర్వీసులను కూడా తగ్గించడం సరైనది కాదని తక్షణమే ఆ ప్రాంతం వైపు సర్వీసులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నడపాలి తప్ప కేవలం లాభాలు మాత్రమే చూడకూడదు అని అన్నారు. ముఖ్యమైన ప్రాంతాలకు బస్సులు రద్దు చేయడం వల్ల ప్రైవేటు ట్రావెల్స్ పెరిగాయని ఇది పరోక్షంగా ప్రైవేటు ట్రావెల్స్ కి గులాంగిరి చేస్తున్నట్లుగా ఉందని అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఆర్టీసీ బస్టాండ్ ముందు నిలుపుదల చేసి ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊకుంటారని ప్రశ్నించారు. కార్మికులకు పని భారం పెంచుతూ కార్మికుల శారీరకంగా మానసికంగా ఒత్తిడికు గురయ్యే పద్ధతుల్లో వ్యవహరించడం సరైనది కాదని, కార్మికులకు అనారోగ్యం సందర్భంలో హాస్పటల్ కు స్వయంగా డిపో మేనేజరు లెటర్ ఇచ్చి పంపవలసిన బాధ్యత ఉందని అది కూడా ఇక్కడ జరగడం లేదని అన్నారు. కార్మికుల హక్కులు కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మికుల చట్టాలు అమలు చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఉన్నతాధికారులు కలిసి పనిచేస్తేనే ఆర్టీసీ పురోగతి సాధ్యమవుతుందని, గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపోకు అనేక అవార్డులు, రివార్డులు పొందిన చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు.ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు,డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు యుస్తెల జ్యోతి, ఎన్ నాగరాజు, కుంజ శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, సండ్రా భూపేంద్ర, ఎస్ .డి.ఫిరోజ్, ఏ రత్నం, ఏ జేగౌతమి, వై. పూర్ణ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి డి సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నఉన్నతాధికారులు నిర్ణయాలు..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1