Home వార్తలు “ఫియర్” సినిమాకు వస్తున్న స్పందన సంతృప్తినీ ఇస్తోంది 

“ఫియర్” సినిమాకు వస్తున్న స్పందన సంతృప్తినీ ఇస్తోంది 

0

“ఫియర్” సినిమాకు వస్తున్న స్పందన

సంతృప్తినీ ఇస్తోంది 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో “ఫియర్” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మాట్లాడుతూ – హరిత గారు స్క్రీన్ ప్లే బేస్డ్ గా “ఫియర్” సినిమాను రూపొందించారు. ఆమె కథ నెరేట్ చేసి డిస్కషన్స్ చేసేప్పుడే ఈ చిత్రానికి అవార్డ్స్ వస్తాయని అంచనా వేశాను. “ఫియర్” లో మంచి స్క్రీన్ ప్లే ఉందని, ఇటీవల తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లేతో సినిమా రాలేదని ప్రశంసలు రివ్యూస్ లో కూడా వచ్చాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కథలో ఓ మెసేజ్ కూడా చెప్పారు హరిత గారు. మా మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.

నటుడు అప్పాజీ అంబరీష్ మాట్లాడుతూ – “ఫియర్” సినిమా మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అనే పేరొచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. మీడియా మిత్రులు మా సినిమా ప్రమోషన్ కు బాగా సపోర్ట్ చేశారు. ప్రేక్షకుల దగ్గరకు మా సినిమాను తీసుకెళ్లారు. “ఫియర్” సినిమాకు ఒక ఫ్యామిలీ ఎన్విరాన్ మెంట్ లో వర్క్ చేశాం. హరిత గారు, అభి గారు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ వేదికకు తాత పాత్రలో నటించాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా “ఫియర్” సినిమా నచ్చడం సంతోషంగా ఉంది.  అన్నారు.

నటుడు షానీ మాట్లాడుతూ – “ఫియర్” సినిమాలో బూచోడు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ కు నేను బాగా సెట్ అవుతానని హరిత గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బూచోడుగా నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండే క్యారెక్టర్ చేసే అవకాశం “ఫియర్” సినిమాతో దక్కింది. ఈ అవకాశం ఇచ్చిన హరిత, అభి గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ఏఆర్ అభి మాట్లాడుతూ – “ఫియర్” సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. మేము 12వ తేదీన ప్రీమియర్స్ వేశాం. రివ్యూస్ బాగా వచ్చాయి అలాగే ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  14న కంఫర్ట్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాం. అయితే 13వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి జరిగిన విషయంలో మేము ఆయన అభిమానులుగా, ఇండస్ట్రీకి చెందిన వారుగా చాలా బాధపడ్డాం. ఆయన విషయంలో ఏదైన దురదృష్టకరమైనది జరిగితే సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేయాలని అనుకున్నాం. అయితే అదృష్టవశాత్తూ అల్లు అర్జున్ గారు బెయిల్ పై బయటకు వచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. 150 థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశాం. మేము రిలీజ్ చేసిన ప్రతి సెంటర్ లో సినిమా స్క్రీనింగ్ అవుతోంది. ఎక్కడా షోస్ క్యాన్సిల్ కాలేదు. కలెక్షన్స్, ప్రేక్షకుల స్పందన బాగున్నాయి. ముఖ్యంగా మా డైరెక్టర్ హరిత గురించి  చెప్పాలి. ఆమె ఈ సినిమాను ఎంతో క్రియేటివ్ గా తెరకెక్కించిన విధానం చూసి ఆశ్చర్యపోయాను. నా వైఫ్ హరితలో ఇంత ప్రతిభ ఉందా అనిపించింది. డైరెక్టర్ గా ఆమె నాకు హిట్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. మేము ఆరేడు నెలల్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశామంటే మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్ ఎంతో ఉంది. చిన్న సినిమా అంటే సాధారణంగా ఫైట్స్, రొమాన్స్..ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ “ఫియర్” సినిమాను ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా సిన్సియర్ ఎఫర్ట్ తో డిఫరెంట్ గా చేశారనే ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా మా మూవీని చూడని వారుంటే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నారు.

నటి సాహితి దాసరి మాట్లాడుతూ – “ఫియర్” సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్నట్లు, ఈ చిత్రంలోని సంపత్ ఎక్కడ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. “ఫియర్” సినిమాకు స్క్రీన్ ప్లే హీరో. మా మూవీ చూడని ఆడియెన్స్ ఉంటే తప్పకుండా చూడాలని కోరుతున్నా. అన్నారు.

డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ – “ఫియర్” సినిమాకు ప్రేక్షకుల నుంచి మీడియా నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా చెప్పని కొన్ని విషయాలు ఈరోజు రివీల్ చేయాలనుకుంటున్నా. మా సినిమాను 16 రోజుల్లో కంప్లీట్ చేశాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్ కు అప్లై చేశాం. 39 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో 70కి పైగా అవార్డ్స్ వచ్చాయి. సినిమా స్టార్ట్ చేసిన 7 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. ఇవన్నీ “ఫియర్” సినిమా విషయంలో మేము సాధించిన విజయాలుగానే భావిస్తాం. ఒక చిన్న చిత్రాన్ని ఇంత తక్కువ టైమ్ లో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో అన్ని హంగులతో రూపొందించి రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతో కోపరేట్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ జ్యూరీ ఉండే అవార్డ్స్ లో 70కి పైగా అవార్డ్స్ గెల్చుకోవడం మామూలు విషయం కాదు. ఒక సెలబ్రిటీ ఎవరైనా ఒక అవార్డ్ గెల్చుకుంటే ఎంతో ప్రచారం దక్కుతుంది. కానీ మేము కొత్తవాళ్లం కాబట్టి పెద్దగా ఎవరూ ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఫోకస్ చేయడం లేదు. మా సినిమాలో కొన్ని విషయాలను రివ్యూయర్స్ కూడా అబ్జర్వ్  చేయలేదు. “ఫియర్”లో ఒక కలర్ ప్యాట్రన్ యూజ్ చేశాం. అలాగే సీన్ మూడ్ కు తగిన కలర్ కాస్ట్యూమ్స్ ఉపయోగించాం. ఇప్పటిదాకా మన ఇండస్ట్రీలో ఇలా ఒక యూనిక్ కలర్ ప్యాట్రన్ లో సినిమా రాలేదు. కొన్ని సీన్స్ సింగిల్ షాట్ సీన్స్ చేశాం.  ఇది సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ హారర్ కాన్సెప్ట్ అని ముందే చెప్పాం. ఎక్కడా కథను డీవియేట్ చేస్తూ అనవసర ఎలిమెంట్స్ పెట్టలేదు. కథకు స్టిక్ అయ్యే సినిమా రూపొందించాను.  చిన్న చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడం కుదరదు. బడ్జెట్ సరిపోదు. నాకున్న బడ్జెట్ లో క్వాలిటీ మూవీ చేశాం. మా కథకు, పాత్రకు ఏం కావాలో ఆలోచించే వేదిక గారిని తీసుకున్నాం. ఆమె చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు.  దర్శకురాలిగా నాకు రివ్యూస్ తో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. నిర్మాతగా అభి గారు ఎంతో కష్టపడ్డారు. రిస్క్ తీసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ ఉండరు అంటారు కానీ మా “ఫియర్” సినిమాకు రిపీట్ ఆడియెన్స్ ఉంటే ఛాన్స్ ఉంది. రివ్యూస్ రాసిన వాళ్లు, సినిమా చూసిన ప్రేక్షకులు కూడా నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ గమనించి మరోసారి సినిమా చూడిండి. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్ లో చూస్తే “ఫియర్” సినిమా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ తో కలిసి చూడగలిగే సినిమా. ఎవరైనా ఇంకా మూవీ చూడని వారుంటే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని మరియు అప్పాజీ అంబరీష్ తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని (Story : “ఫియర్” సినిమాకు వస్తున్న స్పందన సంతృప్తినీ ఇస్తోంది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version