పాల ఉత్పత్తిదారుల
సహకార సంఘ ముఖ్య సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని సంఘం డైరీ శీతలీకరణ కేంద్రము జనరల్ బాడీ సమావేశం సోమవారం ఎండ్లూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం డైరీ డైరెక్టర్ గడిపూడి ఆంజనేయులు , మేనేజర్ మక్కెన జానకి రామారావు లు పాల్గొని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 57వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆలూరి రమణయ్య మాట్లాడుతూ. డి.వి.సి అభయా లో అంతర్భాగమైన మరణ సహాయనిధి క్రింద 1,50,000/- రూపాయలు మరియు రిటైర్మెంట్ పథకము ద్వారా వయస్సు, సర్వీసు, సీనియారిటీ ప్రాతిపదికన 1,00,000/- వచ్చు ఏర్పాటు చేయుచున్న సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మరియు డైరీ పాలకవర్గ సభ్యులకు, సంఘాల అధ్యక్షులకు, సంఘం డైరీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి పసుపులేటి సుబ్బారావు, పాలసీతలీకరణ కేంద్రము కోఆర్డినేటర్ గంటా రామకోటయ్య, ఎం. సురేష్, ఎం హరికృష్ణ, ఎన్ రామకృష్ణ, జి. కిరణ్, ఎం. ప్రసాదు, టి. ఏసుబాబు, కే. రామాంజనేయులు, జి. శ్రీకాంత్, ఎం. హర్షవర్ధన్ రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. (Story : పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ ముఖ్య సమావేశం)