పోలీస్ కిష్టయ్య వీర మరణాన్ని తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా వర్ధంతి జయంతి వేడుకలు నిర్వహించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం డిసెంబర్ 1/2009నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణ నడిబొడ్డున పోలీస్ డ్యూటీలో ఉండి సెల్ టవర్ ఎక్కి, నా… ఈ… చావుతోనైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ సర్వీస్ తుపాకీతో కనతపై కాల్చుకొని వీర మరణం పొంది తెలంగాణ తొలి అమరుడైన పోలీస్ పుట్టగొక్కుల కిష్టయ్య ముదిరాజ్, ప్రత్యేక తెలంగాణ వస్తే వెనుకబడిన తరగతుల వారు వెనుకబడిన జాతుల వారు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతారని, బడుగు బలహీన వర్గాల స్థితిగతులను చూస్తూ భరించలేక ఆత్మ బలిదానానికి పూనుకున్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొరకు పోలీస్ కిష్టయ్య వీర మరణాన్ని గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా వర్ధంతి జయంతి వేడుకలు నిర్వహించాలని, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు అమరుడైన పుట్టకొక్కల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ గారి విగ్రహం పోలీసులకు స్ఫూర్తిగా ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణంలో విగ్ర ప్రతిష్టాపన చేయాలని, పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కుటుంబాన్ని ఆర్థికంగానూ వారి కుటుంబానికి ఉద్యోగ కల్పిస్తూ ఆదుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ బొలెముని లక్ష్మయ్య ,వాకిటి శ్రీధర్ , డాక్టర్ పగిడాల శ్రీనివాస్ , నందిమల్ల అశోక్ , పుట్ట బాలరాజు గారు, నందిమల్ల యాదయ్ , రాగి వేణు , ఎర్ర మన్యం , జానంపేట శ్రీనివాసులు , ఉందేకోటి నాగేంద్ర , బొలెముని కృష్ణయ్య ఉందే కోటి లక్ష్మయ్య నందిమల్ల రమేష్ పిట్టల శ్రీనివాస్ దూడల రమేష్ సంతోష్ .రంగం కిష్టయ్య గారు ఆంజనేయులు అశోక్ పాల్గొన్నారు.(Story : పోలీస్ కిష్టయ్య వీర మరణాన్ని తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా వర్ధంతి జయంతి వేడుకలు నిర్వహించాలి)