UA-35385725-1 UA-35385725-1

డిసెంబర్ 8న నేషనల్ వర్క్ షాప్ జయప్రదం చేయండి

డిసెంబర్ 8న నేషనల్ వర్క్ షాప్ జయప్రదం చేయండి

నేషనల్ వర్క్ షాప్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్య నిర్ధారణ

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : డిసెంబర్ 8న కడపలో నిర్వహించబోయే నేషనల్ వర్క్ షాపును విజయవంతం చేయాలని వర్క్ షాప్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్య నిర్ధారణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక అభివృద్ధిలో ప్రజాసంఘాల పాత్ర పెంపుదల కొరకు, స్వచ్ఛంద సంస్థల మధ్య పరస్పర సహకార వ్యవస్థ ఏర్పాటు కొరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యతిలో నేషనల్ వర్క్ షాపును విస్తృతం చేసేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా సామాజిక అభివృద్ధిలో మరింత భాగస్వామ్యమును ప్రజాసంఘాల ప్రతినిధులకు కలిగించడానికి ఈ జాతీయ సదస్సు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ అనువైన కార్యక్రమాలను నిర్వహించాలన్నదే వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తూ తగిన సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ఆరోగ్యం పర్యావరణ అంశాలు కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కళారూపాల ప్రదర్శనలు కూడా పెంచుకోవాలని తద్వారా సదస్సుకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ అవగతం చేసుకోవడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యావ్యవస్థ నూతన ఆవిష్కరణలు సమకాలిక విద్యావ్యవస్థ యొక్క లోపాలు వాటి అంశాలను గురించి మేధావుల ద్వారా చర్చించడం జరుగుతుందని తెలిపారు. సాటి మానవులకు సంఘటితంగా సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఈ సదస్సుకు చైర్మన్ గా ఇసాక్, వైస్ చైర్మన్ గా కుతుబుద్దీన్, జనరల్ సెక్రటరీగా పోలా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా వ్యవహరిస్తారని తెలిపార . (Story : డిసెంబర్ 8న నేషనల్ వర్క్ షాప్ జయప్రదం చేయండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1