సేవ్ గర్ల్ చైల్డ్ విజేతలకు బహుమతులు
న్యూస్ తెలుగు/విజయవాడ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య అరోగ్య శాఖ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా.నిదిమీనా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బహుమతులు అందజేశారు. అంతర్జాటీయ బాలికల దినోత్సవం సందర్భంగా పీసీపీఎన్‌డీటీ చట్టం అమల్లో భాగంగా సేవ్ గర్ల్ చైల్డ్‌పై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులతో పాటు ప్రసంశా పత్రాలను అందజేశారు. సీడీ`ఎన్సీడీ, కేన్సర్ స్క్రీనింగ్ సర్వే 3.0లో భాగంగా ముద్రించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనగరసింహం, డీఎంహెచ్‌వో డా.సుహాసిని, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఎల్‌టీవో డా.ఉషారాణి, డీసీహెచ్‌ఎస్ డా.బీసీకే నాయక్, ఎన్‌సీడీ`సీగీ పీవో డా.మాధవి నాయుడు, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డా.నవీన్ పాల్గొన్నారు. (Story : సేవ్ గర్ల్ చైల్డ్ విజేతలకు బహుమతులు)