కోతులు, కుక్కలు, పందులతో త్రీవ ఇబ్బందులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్నంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతులను ,కుక్కలను, పందులను పట్టుకోవాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు దండిపోయిన వెంకట అజయ్ కుమార్, తంగిరాల రమేష్ బాబు, మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలో కోతులు, కుక్కలు, పందులతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని బజారులో డజన్ల కొద్ది కుక్కలు తిరుగుతూ స్కూల్లకు, ట్యూషన్లకు వెళుతున్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. దీనివల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పట్నంలోకి కోతులు ఎక్కువగా వచ్చి ఇళ్లల్లో జొరబడి ఇళ్లల్లో ఉన్న బియ్యం, కూరగాయలు మొదలగు వస్తువులు పాడుచేస్తూ ప్రజల తోలుతుంటే వారిపై ఎగబడి దాడులు చేస్తున్నాయని, అలాగే స్లమ్ ఏరియాలో పందులు ఎక్కువగా తిరుగుతున్నాయని వీటిని పట్టుకోపోతే అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి వెంటనే కమిషనర్ స్పందించి వీటిని పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, సుభాని, మల్లికార్జున, లాజర్, మస్తాన్, వెంకటేష్, భాస్కర్, బాషా ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : కోతులు, కుక్కలు, పందులతో త్రీవ ఇబ్బందులు)