న్యాయవాద గుమస్తాల సంఘం ఎన్నిక ఏకగ్రీవ
న్యూస్‌తెలుగు/వినుకొండ : న్యాయవాద గుమస్తాల సంఘం ఏకగ్రీవ ఎన్నిక ల గుమస్తాల సంఘం సర్వ సభ్యులు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వినుకొండ నూతన అధ్యక్షులుగా కాకర్ల చిన్నదానం, ప్రధాన కార్యదర్శిగా గుంజారి నరసింహారావు, కట్టెంపూడి మరియా బాబు, ప్రజల గా నర్రా దేవయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గుమస్తాల సంక్షేమం కోసం మరియు సమస్యల పరిష్కరించడానికి కలిసికట్టుగా పనిచేస్తామని, గుమస్తాల సంఘం ఆఫీసు కొరకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన న్యాయవాద గుమస్తాల సంఘమునకు నియోజకవర్గ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. (Story :న్యాయవాద గుమస్తాల సంఘం ఎన్నిక ఏకగ్రీవ )