ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కె. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్. ఎస్. ఎస్. యూనిట్ అధ్యర్యoలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. హ్రివేణి అధ్యక్షతన జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా.త్రివేణి మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇండియాకు చేసిన త్యాగం మరువలేనిది, స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో అరబ్దేశాల మద్దతును (ఇండియాకు)తెలిపేలా కృషిచేశారు. విద్యా ద్వార ప్రపంచాన్నే జయించవచ్చు. విద్యా ఉంటె ప్రపంచంలో గౌరవం, ప్రతీఒక్కరు దిగ్విజయుడనీ ,విద్యా ప్రపంచ సూచిక అని తెలియచేస్తు, ఆజాద్ వేదాంతి, పండితుడు, రాజకీయవేత్త మరియు తత్వవేత్త. భారతదేశ విద్యా రంగంలో శాశ్వతమైన కృషినీ చెపట్టిన అత్యుత్తమ మేధావి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అతను 1947 నుండి 1958 వరకు భారతదేశం యొక్క మొదటి విద్యా మంత్రిగా/మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశారని తెలిపారు. భారతదేశం నుండి ప్రపంచదేశాలలో సేవచేస్తున్న ప్రతి భారతీయుడు భారత దేశానికి గర్వకారణమని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి డా.బి. గోపాల్ నాయక్ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో డా, ఎస్. షమీవుల్లా, డా. ఎస్.చిట్టెమ్మ, ఎం.భువనేశ్వరి, ఎ.కిరణ్ కుమార్, సరస్వతి, మీనా, బి. ఆనంద్, హైమావతి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం)