అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికి ఆదర్శం
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతరత్న కలాం భారతదేశ తొలి విద్యామంత్రిగా పనిచేస్తూ ఆయన రూపొందించిన విద్యావిధానం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పారు. సమైక్యతా వాది ఆజాద్ మతసామరస్యాన్ని ఆచరించి చూపించారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ యాదయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ ఛైర్మన్ పుట్టపాకుల మహేష్, సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికి ఆదర్శం) అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికి ఆదర్శం