ప్రజల సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే
సిపిఐ వినుకొండ
న్యూస్‌తెలుగు/వినుకొండ : మనదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం నిజాయితీగా పోరాటాలు చేసిందని, ఆనాడు స్వాతంత్ర్య సంగ్రామంలో తెల్లదొరలు ఈ దేశం నుండి వెళ్లిపోవాలని మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో సోమవారం ఉదయం జరిగిన సిపిఐ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గ్రామ పట్టణ నియోజకవర్గాల లోని అన్ని శాఖల సమావేశాలు నిర్వహించాలని ఆయా శాఖలలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కారానికి తగు నిర్ణయాలు పోరాట కార్యక్రమాలు రూపొందించాలని ఆయన తెలిపారు. ఈ డిసెంబర్ 26 నాటికి పార్టీ ఆవిర్భవించి 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని పార్టీ శాఖలలో అరుణ పతాకాలు ఆవిష్కరించాలన, పార్టీ చరిత్రను అమరజీవుల, పార్టీ ఆశయాలను సమావేశాలలో కార్యకర్తలకు బోధించాలని ఆయన తెలిపారు. గత 100 సంవత్సరాలలో సిపిఐ భారత దేశంలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు రైతాంగ హక్కుల కొరకు వారి సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసిందని అనేక విజయాలు సాధించిందని అన్నారు. సెంటు కుంటలేని నిరుపేద రైతాంగానికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు బంజరు భూములు లక్షలాది ఎకరాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, మాజీ వైస్ చైర్మన్ తదితరులు మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పిలుపులను అమలు చేస్తు శాఖల సమావేశాలు నిర్వహిస్తున్నామని పార్టీ సభ్యత్వం కార్యక్రమం పూర్తి చేస్తామని ఇళ్ల స్థలాల సమస్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అర్జీలు పెట్టించడం పూర్తి చేస్తామని ఉచిత ఇసుక కరెంటు సమస్యలపై పోరాట కార్యక్రమాలను పొందించుకొని పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు షేక్ కిషోర్, కొండముట్ల సుభాని, షేక్ మస్తాన్, కొప్పురపు మల్లికార్జునరావు, బల్లే పల్లి పద్మ, రమణ, సువార్త, ఆంజనేయులు, పొట్లూరి వెంకటేశ్వర్లు, రామారావు, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజల సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే)