రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానం
శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామప్రసాద్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ ను ఆసుపత్రిలోని వైద్యులు, నర్సుల చేతుల మీదుగా వారు అందజేశారు. అనంతరం నామ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సేవ కార్యక్రమము కు దాతగా కీర్తిశేషులు దాసరి తురసమ్మ వెంకటస్వామి వారి సహాయ సహకారాలతో నిర్వహించామని తెలిపారు. గర్భిణీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి శుక్రవారం ఇటువంటి సేవా కార్యక్రమాన్ని పుట్టపర్తి బాబా ఆశీస్సులతో దాతల సహకారంతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయని, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.