జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైన బి.సి. బాలుర హాస్టల్ విద్యార్థులు
న్యూస్ తెలుగు /వినుకొండ :- ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన ఏలూరు జిల్లా తాడేపల్లి గూడెం రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగం లో అథ్లెటిక్స్ జరిగాయి. బిసి బాలుర హాస్టల్ విద్యార్థి బి. జాషువా 100 మీటర్ పరుగు పందెం లో మూడవ స్థానం లో గెలు పొంది ఈనెల జార్ఖండ్ లు జరిగే స్కూల్ గేమ్స్ నేషనల్ మీట్ లో 4X100 మీటర్స్ రిలేటీమ్ లో పాల్గొంటాడని హాస్టల్ వార్డెన్ కృపావతి తెలియజేశారు. అదేవిధంగా బి. హర్ష శ్రీకాకుళం జిల్లా అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ లో 100 మీటర్స్, 200 మీటర్స్ లో నాలగవ స్థానం లో ,ఏ. వెంకట రెడ్డి సిరిపురం లో జరిగిన జిల్లా స్థాయి 200 మీటర్ల పరుగు పందెం పోటీలలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడని వార్డెన్ కృపావతి తెలిపారు.
ఈ సందర్భంగా హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి యూ. చంద్రజిత్ యాదవ్ గారు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యస్.కే జాని, తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు సంతోష్ హాజరై గెలుపొందిన విద్యార్థులకు మరియు అథ్లెటిక్ కోచ్ డి. అశోక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైన బి.సి. బాలుర హాస్టల్ విద్యార్థులు)