క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు
క్రికెట్ కోచ్ రాజశేఖర్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ రసవత్తంగా జరిగింది. అనంతరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇందులో భాగంగా ధర్మవరంలో నార్పల అండర్-16 అమ్మాయిలు జట్టు, ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు తలపడ్డ ఇందులో టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 23.3 ఓవర్లలో 100/10 పరుగులు చేసిందన్నారు. ధర్మవరం జట్టులోని హస్మిత 5 వికెట్లు కాగా, తర్వత బ్యాటింగ్‌కి దిగిన ధర్మవరం జట్టు 9 ఓవర్లలో 102/1 పరుగులు చేసిందన్నారు. ధర్మవరం జట్టు లోని హస్మిత 56(31) పరుగులతో అజేయంగా నిలచి,ధర్మవరం జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు. అనంతరం విజేతలకు కోచ్ రాజశేఖర్ తో పాటు ఇతర క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు)