పోగొట్టుకున్న మొబైల్‌ను కనుగొనేందుకు మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను ట్రేస్ చేసి, వాటిని తిరిగి బాధితులకు అందజేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా “మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం”ను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 8న జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై పట్టణంలోని సైబరు సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్ను సంప్రదించి, మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అదే విధంగా 8977945606 అనే మొబైల్ నంబరుకు మొబైల్ పోగొట్టుకున్న మెసేజ్ పంపినట్లయితే ఒక గూగుల్ ఫారంను వారికి పంపడం జరుగుతుందన్నారు. ఈ గూగుల్ ఫారంలో పొందుపర్చిన వివరాలను మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు పూర్తి చేసినట్లయితే, వాటిని ట్రేస్ చేసి, బాధితులకు తిరిగి అందజేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోనులను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్’సిస్టం’ ను ఏర్పాటు చేసామన్నారు. ఈ విధానంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు విజయనగరం పట్టణంలోని సైబరు సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీసు స్టేషను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాలను అందించినట్లయితే, వారు సదరు ఫిర్యాదును ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైలు ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసేందుకు 8977945606 మొబైల్ నంబరును ఏర్పాటు చేసామని, ఆ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అన్న సందేశాన్ని పంపితే, వారు పంపిన మొబైలు ఒక గూగుల్ ఫారం వస్తుందన్నారు. ఈ గూగుల్ ఫారంను పూర్తి చేసి, తిరిగి 8977945606 పంపినట్లయితే, వారి ఫిర్యాదును నమోదు చేసుకొని, పోయిన మొబైల్ ను ట్రేస్ చేసేందుకు చర్చలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.జిల్లాలో సుమారు 5.5 కోట్ల విలువైన 3000 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, బాధితులకు ఇప్పటి వరకు అందజేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 300 మొబైల్ ఫోనులను సైబరు సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం శ్రమించి, ట్రాక్ చేయడం జరిగిందన్నారు. పోయిన మొబైల్స్ గురించిన ఫిర్యాదులను ప్రస్తుతం https://www.ceir.gov.in ఆన్ లైను ద్వారా స్వీకరించి, ట్రేస్ చేసి, బాధితులకు అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. కొంతమంది నేరస్థులు గంజాయి అక్రమ రవాణ, హత్యలు, ఇతర నేరాలను చేసేందుకు వినియోగించిన తరువాత, ఆయా నేరాల నుండి తప్పించుకొనే క్రమంలో నేరస్థులు మొబైల్స్ పారేస్తారని, అటువంటి మొబైల్స్ ఎవరైనా వాడినట్లయితే పోలీసులు, కోర్టుల నుండి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ అన్నారు. కావున, ఎవరికైనా మొబైల్ దొరికితే వాటిని స్థానిక పోలీసు స్టేషనుకు అప్పగించాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.
అనంతరం, ట్రేస్ చేసిన 300 మొబైల్స్ ను బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అందజేసారు. బాధితులకు అందజేసిన వాటిలో 3 – ఐ ఫోన్లు, 26 – వన్ ప్లస్ ఒన్ ఫోన్లు, 32 సాంసన్ మెబైల్స్, 71 – వివో మెబైల్స్, 48 – రెడ్ మీ, 45 – ఒప్పో మొబైల్స్, 15 ఐక్యూ మెబైల్స్, 33 – రియల్ మీ, 15 – పోకో ఫోన్లు,7 – ఇన్ఫినెక్స్, 4 – మోటోరోలో మొబైల్స్, ఒక ఆక్సిన్ ఎన్ మొబైల్ ఉందని, మొత్తం 300 మొబైల్స్ విలువ రూ. 56.47 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. పొగొట్టుకున్న మొబైల్స్ ను తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకుఅప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గార్కి బాధితులు కృతజ్ఞతలు తెలిపి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిస్పీ ఎం.శ్రీనివాసరావు, సైబరు సెల్ సిఐ ఎల్. అప్పల నాయుడు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.ఎస్.ఆర్.కే.చౌదరి, సైబరు సెల్ ఎస్సై లు ప్రశాంత కుమార్, నజీమా బేగం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : పోగొట్టుకున్న మొబైల్‌ను కనుగొనేందుకు మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు)