ఛలోఢిల్లీ ..పార్లమెంట్ మార్చ్ జయప్రదం చేయండి
పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అధిక ధరలు తగ్గించాలని పేదరికం నిర్మూలించాలని కోరుతూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ,ఆర్ ఎస్ పి, పి ఎస్ యు విద్యార్ధి సంఘం సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 28 వ తేది దేశ రాజధాని ఢిల్లీలో జరుగు పార్లమెంటు మార్చ్ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ధర్మవరం పట్టణంలోని ఐటిఐ కళాశాల నందు పోస్టర్ విడుదల చేయడం జరిగింది.అనంతరం మంజుల నరేంద్ర మాట్లాడుతూ 2014లో మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనిచెప్పి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పించి పేదరికానీ నిర్ములన చేస్తామని, పేదలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. కానీ అమలు కాకపోవడం దారుణమని తెలిపారు.అధికారం చేపట్టిన 10 సంవత్సరాలు పూర్తి అయినా ఉద్యోగ కల్పనకోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకపోగా వున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడే విధంగా చేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వ లెక్కల గణాంకాల ప్రకారం దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా 23.7 శాతము నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు.వీటి పైన స్పందించాల్సిన మోడీ ప్రభుత్వం నోరు మెదపక పోవడం దారుణ అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల అభివృద్ధి కోసంగాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు కానీ కేంద్ర బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించకపోవడం అన్యాయంఅన్నారు. దీని వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువకులు తప్పుదోవ పట్టి అనేక అసాంఘిక కార్యక్రమాలకు బానిసలు అవుతున్నారు. (Story : ఛలోఢిల్లీ ..పార్లమెంట్ మార్చ్ జయప్రదం చేయండి)