సీతం కళాశాలలో క్రియేట్ ఎమ్మెర్సివ్
విత్ ఎక్స్పీరియన్స్” పై సెమినార్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘క్రియేట్ ఎమ్మెర్సివ్ విత్ ఎక్స్పీరియన్స్” సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరిచారు. శిక్షకుడు ఎర్ర శివాజీ ,ఫౌండర్ ప్లగ్ ఎక్సర్.కామ్ సెమినార్‌ను సులభతరం చేసి, విద్యార్థులను ప్రాజెక్టు కోడింగ్ మీద స్ఫూర్తిని పెంపొందించారు. ప్రాజెక్టు కాంపిటీషన్‌లో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఆసక్తిని పెంచారు. విద్యార్థులు అనేక పజిల్స్ అభివృద్ధి చేసి, వర్క్‌షాప్‌లో తాము పొందిన అనుభవాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ప్లగ్ ఎక్స్ ఆర్, సీతం మధ్య 6వ తారీఖున ఎం.ఓ.యు జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డా. మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, “రియల్ టైమ్ ప్రాజెక్టులు మీద ఆసక్తి కనపరచాలని ప్రాజెక్ట్‌లను నిర్వహించడం, వివిధ రంగాలలో సామర్థ్యాలను వృద్ధి చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
సీతం కళాశాల ప్రిన్సిపాల్ డా. ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైనఉపాధి అవకాశాలు పొందవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు మరియు డేటా సైన్స్ విభాగాధిపతి డా. రాధ ,కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. జి. వేణుమాధవ్ , ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగాధిపతి డా. టి.డి.వి.ఎ.నాయుడు ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం కళాశాలలో క్రియేట్ ఎమ్మెర్సివ్)