రసవత్తంగా జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయిజిల్లా) : పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోలీసులకు, విలేకరులకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ రసవత్తంగా కొనసాగింది. ఈ క్రికెట్ మ్యాచ్ సందా రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ను పోలీస్ జట్టు ఎంచుకున్నది. బ్యాటింగ్ విభాగంలో వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ వీరోచిత ఇన్నింగ్స్ వేశారు. ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభకులుగా టిడిపి సీనియర్ నాయకులు కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షులు పరిశే సుధాకర్, జింకా పురుషోత్తంలు క్రికెట్ ఆడే సభ్యులతో పరిచయ కార్యక్రమం అనంతరం పోలీస్ జట్టు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ను ఎంచుకోవడం జరిగింది. మొదటి ఓవర్ లోనే సీఐ అవుటు కాగా, పోలిసు జట్టు 14 ఓవర్లో 155 పరుగులు మూడు వికెట్లను కోల్పోయింది. అత్యధికంగా సిఐ నాగేంద్రప్రసాద్ 65 పరుగులతో ఇస్సాకు 42 పరుగులతో రాణించారు. తదుపరి బ్యాటింగ్ దిగిన ప్రెస్క్లబ్ జట్టు మొదటి నాలుగు ఓవర్లో బాగా రాణించినప్పటికీ జట్టులో నిలకడగా బ్యాటింగ్ చేయకపోవడం వలన 14 ఓవర్లో 97/7 వికెట్లను సమర్పించింది. విలేఖరి శంకర్ 38 పరుగులతో రాణించినప్పటికీ ఓటమిపాలు అయ్యారు. పోలీస్ జట్టు 58 పరుగులతో విజయం సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ కు దక్కింది. తదుపరి మ్యాచ్లో సందా రాఘవ టీంపాల్గొనడం జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన మున్సిపాలిటీ 99 పరుగులు చేసింది. రెండవ బ్యాటింగ్ చేసిన సంద రాఘవ టీం నూరు పరుగులు ఛేదించింది. అన్నం సాయినాథ్ 54 పరుగులతో విజయంతో కీలకపాత్ర వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, సంద రాఘవ, ఎన్ డి ఏ నాయకులు విజయ్ తెలియని వారిని అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యనిర్వాహకులుగా భరతు,అన్నం సాయినాథ్,ఫయాజ్ పాల్గొన్నారు.(Story:రసవత్తంగా జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్)