ఒరిగిన ట్రాన్స్ఫార్మర్.. మరమ్మత్తులు చేయించండి
ట్రాన్స్ఫార్మర్ కింద పడితే అతి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వెనుక భాగాన ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మి బీటలు ఉండడంతో పూర్తిగా ఒరిగిపోయింది. అసలే వానాకాలం, ఎప్పుడు కింద పడుతుందో? ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో? అని ఆ వార్డు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు తెలుపుతున్నారు. దిమ్మె నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ఈ దుస్థితికి కారణము అని ప్రజలు తెలుపుతున్నారు. ఈ ట్రాన్స్ఫారం కిందకు పడిపోతే పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు గమనించి దిమ్మెను మరమ్మత్తు చేయడమో..?, లేదా నూతన దిమ్మెను నిర్మాణం చేయడమో చేయాలని ఆ వార్డు ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ అధికారులు మేల్కోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. (Story : ఒరిగిన ట్రాన్స్ఫార్మర్.. మరమ్మత్తులు చేయించండి )