UA-35385725-1 UA-35385725-1

ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌

ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌

న్యూస్‌ తెలుగు/అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌ – 2024) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు అధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెట్‌ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచారు. టెట్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా..అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. గత అక్టోబరు 3వ తేదీ నుంచి 21వరకు ఏపీ టెట్‌ పరీక్షలను నిర్వహించారు. ఏపీ టెట్‌ -2024 పరీక్షను నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్ష రాశారు. 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. త్వరలో16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో టెట్‌లో అర్హత సాధించిన వారంతా ఉత్సాహంగా ఉన్నారు. అంతకుముందు టెట్‌ అర్హత సర్టిఫికెట్‌ ఏడేళ్లు మాత్రమే ఉండేది. దానిని 2022 నుంచి జీవిత కాలంగా మార్చారు. మార్చారు. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. టెట్‌లో అర్హత సాధించిన వారంతా డీఎస్సీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1