పోతుకుంట చెరువుకు పూజలు నిర్వహించిన చిలకం మధుసూదన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల కురిసిన వర్షాలకు ధర్మవరం పట్టణంలోని చెరువుతోపాటు పోతుకుంట చెరువు కూడా పూర్తిగా నిండి మరువ పారు తున్నది. ఈ సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అక్కడికి చేరుకొని పూజలు నిర్వహించుకుంటూ, ఉల్లాసమైన సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగా పోతుకుంట చెరువు వద్దకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకం మధుసూదన్ రెడ్డి. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ చేరుకొని చెరువుకు ప్రత్యేక పూజలను నిర్వహించడంతోపాటు జల హారతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం, పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక వర్షాలు కురవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మారం పట్టణంలో కూడా చెరువులు పూర్తిగా నిండడం, రైతులు పంట వేసుకోవడానికి అవకాశం వచ్చిందని తెలిపారు. గతంలో చెరువులు నిండిన కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక చుక్క నీరు కూడా రైతులకు ఇవ్వకపోవడం, రైతులు పంటలు వేసుకోకపోవడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రైతుల విషయంపై కూడా ఎంతో కృషి చేస్తుందని, తప్పకుండా ఆ రైతుల సమస్యలను తీరుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : పోతుకుంట చెరువుకు పూజలు నిర్వహించిన చిలకం మధుసూదన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్)