కులగణనలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రం రోల్ మోడల్ అవ్వాలి
సర్వేలో కార్యకర్తలు విధిగా పాల్గొనాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఈనెల 6వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పకుండా పాల్గొనాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన కుల గణన సర్వేపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు సర్వేలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రానికే రోల్డ్ మోడల్ గా నిలవాలని ఆ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సర్వే చేపట్టే అధికారుల మమేకమై సర్వే చేయించాలని ఎమ్మెల్యే సూచించారు. సర్వే చేపట్టే అధికారులతో గ్రామాల్లోని కార్యకర్తలు నాయకులు మమేకమవ్వాలని ప్రతి ఒక్కరి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేసే విధంగా జాగ్రత్తపడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన రాహుల్ గాంధీ కుల గణన చేపట్టాలని చేసిన ఆదేశాల మేరకే పోయిన నెల 30వ తేదీన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో , కుల గణనపై సానుకూల సమగ్ర చర్చ జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో కేవలం బీహార్ లోనే ఈ కుల గణన కార్యక్రమం జరిగిందని తదనంతరం నేడు తెలంగాణ రాష్ట్రంలోనే కుల గణన కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు. ప్రతి కార్యకర్త విధిగా సర్వేలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీనియర్ కార్యకర్తలు నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story : కులగణనలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రం రోల్ మోడల్ అవ్వాలి)