విద్యార్ధుల చొరువ, ధైర్యాన్ని ప్రశంసించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి వింతసంఘటన ఎదురై ఆశ్చర్యపోవడం తనవంతైంది. విషయానికొస్తే గౌరవ నిరంజన్ రెడ్డి తన ఇంటిలో నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తుండగా ఇద్దరు విద్యార్థులు తడుముకోకుండా నిరంజన్ రెడ్డి దగ్గరికి చేరుకొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆప్యాయంగా పలకరించారు.విద్యార్థులు వినోద్ మురళీ గార్లు మాట్లాడుతూ మేము గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నామని కె.సి.ఆర్ తాత మీ హయాములో మా పాఠశాలలో భోజనం,సౌకర్యాలు బాగున్నాయని అందుకు మీకు కృతజ్ఞతలు అని తడుముకోకుండా తెలియజేసారు. వారి సుజనాత్మకత,చొరవ,ధైర్యం మెచ్చుకొని బాగా చదువుకొని మన ప్రాంతానికి సేవ చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. కొసమెరుపు ఏమిటంటే విద్యార్థులు సార్ మాది 6వార్డ్ మెట్టుపల్లి తాండా మీతో మా సంభాషణ సోషల్ మీడియా గ్రూపులో పెట్టండి అని విజ్ఞప్తి చేసారు. నిరంజన్ రెడ్డి విద్యార్థులకు చిరు కానుక అందజేసి ఆశీర్వదించారు. (Story : విద్యార్ధుల చొరువ, ధైర్యాన్ని ప్రశంసించిన మాజీ మంత్రి)