ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అవసరం
ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అధికారులు కౌన్సిలర్ల సహాయంతో ముందుకు వెళ్తామని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో జరుగు కౌన్సిల్ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా మొట్టమొదటిసారి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి దిశలో తీసుకొని అంశంలో భాగంగా 53 అంశాలపై కౌన్సిలర్లతో చైర్మన్ లక్ష్మి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. కౌన్సిలర్లు అందరూ కూడా 53 అంశాలపై తమ ఆమోదమును తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, రామకృష్ణ, బ్రహ్మయ్య, తదితర కౌన్సిలర్లు పట్టణములో నెలకొన్న సమస్యలను వారు చైర్మన్ తో పాటు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో వీధి దీపాల వీధి దీపాల సమస్య, సమాధుల సమస్య, మున్సిపల్ ఆఫీసుకు వచ్చే కరెంటు బిల్లు సమస్య, ధర్మవరం టు చిన్నూరుకు వెళ్లేందుకు బ్రిడ్జ్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్య, కాలువలను సైజు పెంచే సమస్య, చెత్తను తొలగించేందుకు వచ్చే ఆటోలు సరిగా రావడం లేదని, పురపాలక సంఘానికి రావలసిన టౌన్ ప్లానింగ్ నిధులు సొంత నిధులకు వెళుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క అవినీతి అధికంగా ఉందని,తదితర సమస్యలన్నీ కూడా కౌన్సిల్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా సామరస్యంతో కౌన్సిలర్లు యొక్క సలహా సూచనలతో సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. (Story : ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అవసరం)