భారతదేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు అనన్యమైనవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : భారతదేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అసమాన సేవలు అని అనన్యమైనవి అని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ (జాతీయ ఐక్యత దినోత్సవం-ఏక్తా దివాస్) 150 వ జయంతి వేడుకలను స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆర్డిఓ తో పాటు సిబ్బంది పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించిన పలు విషయాలను, దేశానికి చేసిన వారి సేవలను వివరించారు. అఖండ భారతదేశానికి ఒక రూపాన్ని తెచ్చిన మహనీయుడని తెలిపారు. స్వరాజ్య సాధనకు విశేష కృషి చేస్తూ సంస్థానముల విలీనంలో ముఖ్య కీలకపాత్ర వహించడం జరిగిందని తెలిపారు. దేశ రైతులకు మద్దతు పలుకుతూ రైతన్నలను ఆదుకున్న మహనీయుల ని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహములోనూ స్వాతంత్రం పట్ల ప్రజలను ఉత్తేజపరచడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీజీకి పూర్తి మద్దతు పలకడుతో పలుసార్లు జైలు జీవితం కూడా గడపడం జరిగిందన్నారు. అక్టోబర్ 31, 2014న సర్దార్ పటేలకు గౌరవము ఇస్తూ నివాళిగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించడం జరిగిందన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఆయన చేసిన విశేషమైన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆయనను భారతదేశపు ఉక్కుమనిషిగా పిలవడం జరిగిందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన కీలకపాత్రను పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం గా నాడు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం తన న్యాయవాది వృత్తితో ప్రజల ఐక్యతను విశ్వసించిన రాజనీతిజ్ఞుడు అని తెలిపారు. (Story : భారతదేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు అనన్యమైనవి)