సీతం లో “సుందరం ఫాస్టనర్స్” వారిచే ప్రాంగణ నియామకాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో సుందరం ఫాస్టనర్స్ వారు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు . మొదటగా విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ , బృంద చర్చ, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో ఇ.ఇ.ఇ, మెకానికల్, ఇ.సి.ఇ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో విద్యార్థులని ఎంపిక చేసుకున్నట్టు వారు తెలిజేశారు. ఈ ప్రక్రియ ను “సుందరం ఫాస్టనర్స్” మానవ వనరుల శాఖ సీనియర్ మేనేజర్ ఆదినారాయణ్ , సీనియర్ ఎగ్జిక్యూటివ్ దేవరాజ్, ఆధ్వర్యంలో జరిగాయి. సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ సుందరం ఫాస్టనర్స్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. ప్రతి సంత్సరం సుందరం ఫాస్టనర్స్ ప్రాంగణ నియామకాలు నిర్వహించాలని వారిని కోరారు. సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ఈ కంపెనీ విద్యార్థులని చక్కగా తీర్చి దిద్దుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం కళాశాల డీన్ ప్లేసెమెంట్స్ షాజీనాయర్ పర్యవేక్షణలో నిర్వహించబడినది. (Story : సీతం లో “సుందరం ఫాస్టనర్స్” వారిచే ప్రాంగణ నియామకాలు)