పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం
అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో ఈనెల 10వ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ ,కీర్తిశేషులు గోరకాటి పెద్దారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కోడళ్ళు గోరకాటి ప్రమీదమ్మ గోరకాటి రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్, ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత అద్దాల పంపిణీ ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ,గ్రామీణ, ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తదుపరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కాలేజీ సర్కిల్ వద్దగల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుదర్శన్ గుప్తా, సత్రశాల ప్రసన్న కుమార్, శివయ్య, పెరుమాళ్ళ దాస్ , బివి చలం, గట్టు హరినాథ్,రిటైర్డ్ టీచర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం)