బాధిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా!
న్యూస్ తెలుగు/ సాలూరు : తిరుపతి లో అత్యాచారం చేసిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తుందని.బాలిక పై జరిగిన అత్యాచారానికి సంఘటనకు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమం, మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూతిరుపతి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన చాలా విచారణ వ్యక్తం చేశారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని అన్నారు.బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు ప్రభుత్వం తరపున అందజేస్తున్నామని తెలిపారు.గంటల వ్యవధిలోగా నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది అని అన్నారు.తిరుపతి కలెక్టర్ , SP లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు చిన్నారులను బలితీసుకుంటున్న ఈ మానవ మృగాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కఠిన శిక్ష పడేవిధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు.(Story:బాధిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా!)