వరి కొనుగోలు పై శిక్షణ తరగతులు
జిల్లా మేనేజర్ రాంపతి
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ఖరీఫ్ 2024 25 సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు చేయవలసిన పద్ధతులపై శనివారం తాడ్వాయి లోని రైతు వేదికలో తాడ్వాయి, గోవిందరావుపేట మండలం లకు, పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం పౌర సరఫరా శాఖ ములుగు జిల్లా మేనేజర్ బి . రాంపతి ఆధ్వర్యంలో పి పి సి సెంటర్ ఇన్చార్జి లకు, బుక్ కీపర్ లకు, వ్యవసాయ అధికారులకు, ఆదర్శ రైతులకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని మేనేజర్ రాంపతి తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మేనేజర్ పలు సలహాలు,సూచనలు కొనుగోలు కేంద్రాలు నిర్వహించే వారికి ఇచ్చారు.ముఖ్యంగా రైతుల కొనుగోలు వివరాలు,చెల్లింపులకు సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేయాలో, తేమశాతం గుర్తించడం, దొడ్డు రకం, సన్నధాన్యం రకం గుర్తించడం, దొడ్డు రకం సన్న రకం దాన్యం ఆన్లైన్లో నమోదు చేయవలసిన విధానాలు, గ్రేయిన్ కాలిపర్, హస్కరిమూవర్ పరికరముల ద్వారా సన్నధాన్యం, దొడ్డు ధాన్యం ఏ విధంగా గుర్తించాలో సూచించారు
ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు రైతుల నుండి వచ్చే దాన్యం పారదర్శకంగా కొనాలని వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని నీళ్లు మరియు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కొన్న ధాన్యం వెంటనే ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్ల ద్వారా ట్యాగింగ్ చేయబడిన మిల్లులకు పంపించాలని సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ ఏ క్యూ ప్రమాణాలు పాటించకుండా ఇంకా ఏమైనా అవకతవకలకు పాల్పడితే కొనుగోలు కేంద్రం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోటామని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా పౌరసరఫరాల అధికారి పైసల్ హుస్సేన్ డి సి ఓ సర్దార్ సింగ్ జిసిసి మేనేజర్, తహసీల్దార్, వ్యవసాయ విస్తరణ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, బుక్ కీపర్ లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదర్శ రైతులు పాల్గొన్నారు. (Story : వరి కొనుగోలు పై శిక్షణ తరగతులు)