నేటి మొక్కల పెంపకమే భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడుతుంది
సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ నిర్వాహకులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నేటి మొక్కల పెంపకమే భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడుతుందని సాయి క్లీన్ అండ్ వాకర్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా నాటారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మొక్కల పెంపకం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వాటి పెంపక విషయములో శ్రద్ధను కనపరచాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన సూర్యనారాయణ అనే దాతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్, హెడ్మాస్టర్లు కుల్లాయప్ప, ముస్తాక్ అహ్మద్, డీసీబీసీ గౌరవాధ్యక్షులు గోరకాటి పెద్దారెడ్డి, అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, కార్యదర్శి జబిఉల్లా, సహకార దర్శి ఉదయ్, కోశాధికారి ఓం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (Story : నేటి మొక్కల పెంపకమే భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడుతుంది)