UA-35385725-1 UA-35385725-1

కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు

కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు

ట్రూఅప్‌ ఛార్జీలతో కరెంట్‌ బిల్‌ షాక్‌
ప్రజలపై ఏకంగా రూ.6072 కోట్ల భారం
నాలుగున్నర నెలల్లోనే చంద్రబాబు నయవంచన
ఎన్నికల ముందు విద్యుత్‌ ఛార్జీలు పెంచనంటూ హామీ
ఇప్పుడు యథావిథిగా యూటర్న్‌. ఛార్జీలు పెంపు
ఒక్కో యూనిట్‌పై రూ.1.58 భారం అతి హేయం
ఉచిత పంటల బీమాకు మంగళం. రైతులకు నష్టం
ఇప్పటికీ పెట్టుబడి సాయం ఇవ్వని కూటమి ప్రభుత్వం
అన్‌ స్టాపబుల్‌ షో లో చంద్రబాబువన్నీ పచ్చి అబద్ధాలు
ఎన్టీఆర్‌ మరణంపై ఆ షోలో మాట్లాడితే బాగుండేది
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి నాగార్జున చురకలు
న్యూస్‌తెలుగు/తాడేపల్లి: ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతుండగా, ఏ మాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు సిద్దమైందని, ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.6072 కోట్ల భారం వేస్తోందని బాపట్ల జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అయిదేళ్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, నాలుగున్నర నెలల్లోనే నయవంచన చేస్తున్నారని, ఒక్కో యూనిట్‌పై ఏకంగా రూ.1.58 పెంపు అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి, రైతులకు నష్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం చేయలేదని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఒక టీవీ షో అన్‌ స్టాపబుల్‌ షో లో చంద్రబాబు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పారన్న మెరుగు నాగార్జున, ఎన్టీఆర్‌ మరణంపై ఆ షోలో మాట్లాడితే బాగుండేదని చురకలంటించారు.
మాట తప్పడం, సమస్య వచ్చినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న చంద్రబాబు తాజాగా బుల్లితెర మీద ‘అన్‌ స్టాపబుల్‌ అబద్ధాల’తో డ్రామా చేశారని మాజీ మంత్రి గుర్తు చేశారు. అందుకు కారణం విద్యుత్‌ ఛార్జీలపై పెంపు నిర్ణయమని తెలిపారు. బావ, బావమరిది కలిసి ఆ షో ద్వారా సానుభూతి కోసం పెద్ద డ్రామా చేశారని చెప్పారు. స్కిల్‌స్కామ్‌లో రూ.371 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయినా, తానేం నేరం చేయలేదంటూ, తనను అరెస్టు చేసిన తర్వాత హత్య చేయాలని చూశారంటూ.. పరోక్షంగా చెబుతూ, చంద్రబాబు పచ్చి అబద్ధాలాడారని దుయ్యబట్టారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా పచ్చి అబద్దాలు చెప్పడం కేవలం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పారు.
స్కిల్‌స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికినా.. తన అరెస్ట్‌ అక్రమమని చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారని మెరుగు నాగార్జున ప్రస్తావించారు. జైలులో ప్రభుత్వం చంద్రబాబు కోరిన అన్ని వసతుల కల్పించినా.. సానుభూతి కోసం జైలులో ఏదేదో జరుగుతున్నట్లు, తాను అనారోగ్యం పాలైనట్లు, ప్రాణాలకు ముప్పు ఏర్పడినట్లు తన అనుకూల మీడియాలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. అనారోగ్య కారణాలు సాకుగా చూపే చంద్రబాబు బెయిల్‌ పొందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
నవంబరు నుంచి ఏకంగా 15 నెలల పాటు,ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో భారం మోపాలన్న నిర్ణయం దారుణమని మాజీ మంత్రి అభివర్ణించారు. దాంతోపాటు, కరెంట్‌ వాడకపోయినా రూ.50 కనీస ఛార్జీ వసూలు చేసే సంప్రదాయానికి కూడా తెర తీశారన్న ఆయన, విద్యుత్‌ బిల్లుల్లో శ్లాబ్‌ల విధాన సృష్టికర్త కూడా చంద్రబాబు అని గుర్తు చేశారు. 2014–19 మధ్య కూడా చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలు పెంచారంటూ.. 76 యూనిట్ల విద్యుత్‌కు 2015–16లో రూ.140.10 బిల్లు రాగా, అది 2018–19 నాటికి రూ.190కి పెరిగిందని ఉదహరించారు.  కూటమి ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకోవడం మానేసిందని, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండా పంటల ఈ–క్రాప్‌ కూడా ఆపేశారని చెప్పారు. అదే తమ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేయడమే కాకుండా, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం ఇచ్చిన విషయాన్ని మెరుగు నాగార్జున గుర్తు చేశారు. (Story : కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1