UA-35385725-1 UA-35385725-1

ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేందుకు అంద‌రూ భాగస్వాములు కావాలి

ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేందుకు అంద‌రూ భాగస్వాములు కావాలి

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు

న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం :
అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఉన్న నిరుపేద గిరిజనులకు అందేందుకు, తద్వారా మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.

శుక్రవారం నాడు అయన భద్రాద్రి కొత్తగూడెం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు.

జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, కొత్తగూడెం, భద్రాచలం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్ , ఎస్పీ రోహిత్ రాజ్,అధికారులు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్ర గవర్నర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా అధికారులు, ప్రముఖులతో సమావేశ మందిరంలో ముఖాముఖి సమావేశం అయ్యారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు తెలియజేశారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో, ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న
481 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, గిరిజన కుటుంబాలను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుండి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు అలాగే ఆదివాసి గిరిజన మహిళలు తయారుచేసిన గిరిజన వంటకాలు చాలా బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారత పై ఆధారపడి ఉందని, ఈ విషయం తాను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా సహాయక మహిళలు, గిరిజన మహిళలు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన, వంటకాలలో గుర్తించానని చెప్పారు. అలాగే స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళలు, గిరిజన మహిళల గురించి సమాజానికి తెలియజేయాలని అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారని అన్నారు . మహిళల చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల మెరుగు కోసం కృషి చేయడం చాలా ముఖ్యమని, సమాజంలో ఉన్న చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు .దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 90.6% గిరిజన సంక్షేమ శాఖ గిరిజన విద్యార్థులు పదో తరగతిలో 92 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, చిన్న చిన్న పరికరాల వంటివి తెలియజేస్తే వారు ఇంకా విజ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉందని అన్నారు. అలాగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నదులు, అటవీ సంపద, బిపిఎల్, కె టి పి ఎస్, జెన్కో, భారత్ జల నీటి శుద్ధి కర్మాగారం, సింగరేణి గనులు ఉన్నాయని, నిరుద్యోగులైన అన్ని వర్గాల యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే జీవనోపాధి పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. భద్రాచలం, పర్ణశాల లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల పరంగా పర్యాటక శాఖను అభివృద్ధి చేసుకొని ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చని, విద్య, ఆరోగ్యం, కల్చరల్ , వ్యవసాయం ఉపాధి అవకాశాలలో జిల్లాకి జిల్లాకి మధ్య పోటీ తత్వం ఉంటే అభివృద్ధి అనేది తప్పనిసరిగా సాధ్యమవుతుందని ముఖ్యంగా గిరిజన గ్రామాలలో నివసిస్తున్న మారుమూల ప్రాంత కొండ రెడ్ల గిరిజన విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొండరెడ్ల కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులే కాకుండా ఇతర రైతులు కలానుగుణంగా పంటలు పండించుకొని వృద్ధి లోకి రావాలని అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న అధికారులు ముఖ్యంగా గిరిజన గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం వ్యవసాయం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా గిరిజనులు అభివృద్ధిలోకి వస్తారని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో వైద్యశాలలు బాగా పనిచేయాలని, మారుమూల ప్రాంతాలలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సక్రమంగా నడిచే విధంగా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కావాలని అన్నారు. జిల్లా అభివృద్ధి గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించిన విధానము చాలా బాగుందని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం ,విద్య, వ్యవసాయం, ఉద్యానం, సంక్షేమం ,నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాలు, గిరిజన సంక్షేమం, తదితర ముఖ్యమైన శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.

వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాలలో చేసిన కృషిని రాష్ట్ర గవర్నర్ తో పంచుకున్నారు.

డాక్టర్ ప్రభు డేనియల్ రచయిత, సీతా ప్రసాద్ క్లాసికల్ డాన్సర్, వెంకటయ్య ఔషధ మొక్కల పెంపకం, కొండా విజయ్ కుమార్ సినిమా దర్శకుడు, ఎన్ రాజశేఖర్ ఉత్తమ తోట యజమాని, పశువుల అంజన కుమార్ ఆర్టిస్ట్, ఉయ్కే వెంకటలక్ష్మి శానిటరీ నాప్కిన్ మరియు మిల్లెట్ తయారీ తయారీ యజమాని, మోడం వంశీ పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడలిస్ట్, ఏ శంకర్ గాయకుడు, వి కొండలరావు గాయకుడు, డాక్టర్ బుచ్చయ్య గాయకుడు, T.శ్రీ తేజ నేషనల్ అథ్లెటిక్ బ్రౌన్స్ మెడల్, బట్టు శ్వేత వెయిట్ లిఫ్టింగ్, శ్రీరామ్ శెట్టి కాంతారావు పద్య రచయిత, ఆంగోతి శ్రీనివాసరావు పద్య రచయిత, పి రోశయ్య చౌదరి గాయకుడు, వెంగళ భాస్కర్ పాటల రచయిత, బి రిత్విక శ్రీ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి, ఎస్ సీత రచయిత మరియు కవి, స్నేహ జానపద గాయని, ఎస్ ప్రభాకర చార్యులు రచయిత మరియు కవి, కే దుర్గా చారి రచయిత మరియు కవి, తురిమెళ్ళ కళ్యాణి రచయిత మరియు కవి, ఎస్ కృష్ణమూర్తి రచయిత, నాగరాజశేఖర్ రచయిత, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు

ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను
కవులు రచయితలు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేష్ శ్యామ్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,కొత్తగూడెం ఆర్డీవో మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, మరియు జిల్లా అధికారులు ఐటిడిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేందుకు అంద‌రూ భాగస్వాములు కావాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1