కీటకినాశినిలో డీసీఎం శ్రీరామ్ నూతన ఉత్పాదన
న్యూస్‌తెలుగు/వినుకొండ : నూతన సాంకేతిక పరిశోధనతో డీసీఎం శ్రీరామ్ కంపెనీ రూపొందించిన కీటకినాశిని ఉత్పాదనలు ఆవిష్కరించడం జరిగిందని కంపెనీ మేనేజర్ ఆదిత్య విక్రం తెలిపారు. పట్టణంలోని డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మీనరసింహ ట్రేడర్స్ ఆధ్వర్యంలో మార్కాపురం రోడ్డులోని శ్రీరామ కన్వర్షన్ హాల్లో శుక్రవారం డీలర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విక్రం మాట్లాడుతూ డీసీఎం శ్రీరామ్ కంపెనీ నూతనంగా తీసుకొచ్చిన ఉత్పాదనలు కీటకి నాశిని, పంట పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తాయన్నారు. డీసీఎం శ్రీరామ్ క్రోన్ పురుగుమందు వరి పైరును ఆశించు ఆకు చుట్టు పురుగు మరియు కాండము తలుచు నివారణకు అద్భుతమైన కేటకేనాశిని అని తెలిపారు. శ్రీరామ్ ట్రెక్స్ టర్ మిరప పంటను ఆశించు తామర పురుగు మరియు నల్ల నల్లి ( బ్లాక్ త్రిప్స్)ను నివారిస్తుందన్నారు. శ్రీరామ్ ప్రోటోబజ్ ప్లస్ జింకు లోప నివారణకు, పంట పెరుగుదలకు మంచి ఉత్పాదికమని తెలిపారు. డీసీఎం శ్రీరామ్ కంపెనీ తీసుకువచ్చిన నూతన ఉత్పాదకాలను రైతులు ఉపయోగించి పంటలను రక్షించుకొని మంచి దిగుబడి పొందాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో కంపెనీ ఏపీ హెడ్ వెంకటేశ్వర్లు, సదాశివరావు, 56 మంది డీలర్లు పాల్గొన్నారు. (Story : కీటకినాశినిలో డీసీఎం శ్రీరామ్ నూతన ఉత్పాదన)