అఖిలభారత పశు ఘన సేకరణ పోస్టర్లు విడుదల
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : 21వ అఖిలభారత పశుగణ సేకరణ కార్యక్రమము యొక్క వాల్పోస్టర్లను ఆర్డిఓ మహేష్ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉపసంచాలకులు, ధర్మవరం సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల ధర్మవరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది. ఈ పశు గణ సేకరణ కార్యక్రమం ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి పశు గణన కార్యక్రమం ను ఇంటి వద్దకే వెళ్లి 16 రకాలు అయినటువంటి పశువుల సేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతులందరూ ఈ పశు గణన సేకరణను తమ పశువుల వివరాలను తప్పక నమోదు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జాతులు వాటి రకాలు, వయసు నిర్ధారణ, పాడి ఇచ్చినవి, గర్భం దాల్చినటువంటి రకాలు తెలిపి నమోదు చేసుకోవాలని తెలిపారు. మన రాష్ట్ర జాతి అయినటువంటి ఒంగోలు పుంగనూరు జాతి ఆవులు అంతరించి పోకుండా ఉండుటకు చర్యలు చేపట్ట వలనే తెలిపారు. కావున రైతులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ శేఖర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. (Story : అఖిలభారత పశు ఘన సేకరణ పోస్టర్లు విడుదల)