Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

0

రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులందరూ కూడా ఎంతో నష్టపోయారని ఆ రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ పుట్టపర్తి లోని జిల్లా కలెక్టర్ చేతన్కు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తుంపర్తి బాధితుల రైతుల కష్టాలను కలెక్టర్కు వివరించడం జరిగిందని, ఇళ్ల స్థలాల కోసం రైతులను నడిరోడ్డుకులాగారని తెలిపారు. భారీ వర్షాల వల్ల రైతులు పొలాల్లో వేసిన వరి వేరుశనగ, ద్రాక్ష, ఇతర పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినడం వల్ల రైతులు లక్షల్లో నష్టపోయారని తెలిపారు. రైతులు లక్షలకు లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెడితే సాగు చేస్తున్న పంటలు కోల్పోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు. బోర్లు బావులు కింద సాగు చేసుకున్న పంటలు కూడా కోల్పోవడం జరిగిందని క్షేత్రస్థాయిలోనే నష్టం ఎక్కువగా జరిగిందని కలెక్టర్కు వివరించడం జరిగిందని తెలిపారు. పంట నష్ట అంచనా వేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారము పంటల బీమా అందజేయాలని కోరడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తుంపర్తి భూ బాధిత రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని కలెక్టర్కు తెలపడం జరిగిందని తెలిపారు. తుంపర్తి లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన 90 మంది నిరుపేద కుటుంబాల నుంచి 2017 నవంబర్ 12న గృహ నిర్మాణ కోసం 25 ఎకరాల భూమిని పోతుల నాగేపల్లి రెవెన్యూ పరిధిలో సేకరించడం జరిగిందని తెలిపారు. ఒక ఎకరా పొలం విలువ రెండు కోట్లు విలువ ఉందని ఒక ఎకరాకు అప్పటి ప్రభుత్వం 500000 పరిహారం చెల్లిస్తామని చెప్పగా కొంతమంది రైతులు మాత్రం పరిహారం తీసుకోగా మెజారిటీ సైతం రైతులు ఒప్పుకోకపోవడంతో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు బనాయించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. కావున రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. (Story : రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version