104వ ఉచిత వైద్య చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోండి
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి ఆలయంలో ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 104వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాదం రమణ,, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, కోశాధికారి, క్యాంపు చైర్మన్ డివి. వెంకటేష్ లు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ వైద్యులైన వివేకుల్లయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, సతీష్ కుమార్, జై దీపు నేత, విట్టల్ లచే వైద్య చికిత్సలను నిర్వహించబడునని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గుండా నారాయణస్వామి జ్ఞాపకార్థం ధర్మపత్ని గుండా నాగలక్ష్మి మ్మ, కుమారుడు గూండా నాగరాజు, అరుణ వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు కోరారు. (Story : 104వ ఉచిత వైద్య చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోండి)