ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలి
అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది
శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ సాంబశివుడు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి సుబ్బదాసు సత్రం కన్వీనర్ సాంబశివుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మందికి పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను వైద్యులు,నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేశా మనీ, అదేవిధంగా మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలోని అనాధాశ్రమంలో, తాడిమర్రి మండలం నర్సంపల్లి అనాధాశ్రమంలో 600 మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి వైద్య శిబిరమును కూడా నిర్వహించి 200 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించి, ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలి)