జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాన్ గల్ గ్రామానికి చెందిన గడ్డం. కళావతిసుధాకర్ గార్ల పుత్రిక లావికా సంవృతా మొదటి పుట్టిన రోజు వేడుకలు కె. ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగాయి. బి.ఆర్.ఎస్ నాయకులు గడ్డం.మహేష్ ఆహ్వానం మేరకు ఈ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ ఉన్నారు. (Story : జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి)