తుఫాను బాధితులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాం
ఆర్డీవో మహేష్
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : తుఫాను బాధితులను ఆదుకునే విధంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాధితులను తప్పక ఆదుకుంటామని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన కురిసిన భారీ వర్షానికి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇందులో ముదిగుబ్బ ఏడు, చెన్నై కొత్తపల్లి 19, కనగానపల్లి ఐదు రామగిరి ఎనిమిది మొత్తము వెరసి 39 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అదేవిధంగా పంటల విషయంలో చెన్నై కొత్తపల్లి 62 ఎకరాల 49 సెంట్లు, కనగానపల్లి లో 215 ఎకరాలు, రామగిరి లో 95 ఎకరాలు వెరసి 380 ఎకరాల 68 సెంటు పంట నష్టం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ముదిగుబ్బ మండలంలో పొడ రాళ్లపల్లిలో 32 గొర్రెలు, రామగిరి లో ఒక ఆవు వెరసి 33 పశువులు మృతి చెందడం జరిగిందని తెలిపారు. వీటిపై నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని వారు తెలిపారు.