ముద్రబోయిన రఘు గారి మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు
ఆర్థిక సహాయం రెండు లక్షలు అందించిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం,షాపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల సహాయ కార్యదర్శి ముద్రబోయిన రఘు ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క , రఘు దశదిన కర్మ హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ మండల సహాయ కార్యదర్శి ముద్రబోయిన రఘు, కాంగ్రెస్ పార్టీ మరియు షాపెల్లి కొండాయి దొడ్ల మల్యాల గ్రామాల ప్రజల కోసం ఎంతో విలువైన సేవలు అందించారని తెలిపారు.అతని మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని,ప్రస్తుతం అతని కుటుంబానికి తక్షణ సహాయం కింద రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, జిల్లా,మండల కాంగ్రెస్ నాయకులు కలిసి అందించడం జరిగిందన్నారు.ఇకపై ముందు కూడా అతని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చిన అండగా నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : ముద్రబోయిన రఘు గారి మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు)