చేనేత సమస్యలపై స్పందించిన జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయ శ్రీ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను చూసి జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయ శ్రీ స్పందించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేశవా నగర్ 8వ వార్డు వెళ్లి చేనేత కార్మికుల కుటుంబాలను వారు పరామర్శించి, వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు ఎనిమిదో వాడి ఇంచార్జ్ ధనుంజయ కూడా వెళ్లడం జరిగింది. తదుపరి ఇటీవల కొన్ని రోజులుగా వస్తున్న వర్షానికి మగ్గములోకి నీరు చేరడం వల్ల, చేనేత కార్మికులు ఎంత నష్టపోయారో అనే విషయాన్ని గ్రహించి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంకారపు జయశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం నేతన్నలు పడుతున్న ఇబ్బందులు చెప్పలేని పరిస్థితిలో ఉండడం జరుగుతోందని తెలిపారు. మురికి కాలువల గుండా మురికి నీరు మగ్గం గుంతలోనికి చేరి మగ్గం తడవడంతో, డ్యామేజీఐ నేతన్నులు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని నష్టపోతున్నారని, నష్టాన్ని కూడా చవిచూసి ఎలా బ్రతకాలో అని వారి ఆవేదన నన్ను కలిసి వేసిందని తెలిపారు. మగ్గం లోకి నీరు చేరడం గోడలు కూడా నాని కూలిపోవడానికి అవకాశం ఉందని, గోడలకు కూడా కరెంటు తగిలే అవకాశం ఉందని, దీంతో చేనేత కుటుంబ సభ్యులు కూడా ఈ విద్యుత్ శాఖకు గురి అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితము లేదని వారు మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, చేనేతలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నేతన్నలు పెద్ద ఎత్తున తమ కష్టాలను నాతో చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి ఇక్కడి విషయాన్ని ధర్మారం ఎమ్మార్వో కు, కమిషనర్ కు తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు.(Story : చేనేత సమస్యలపై స్పందించిన జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయ శ్రీ)